దేవుని హృదయమును మరియు ప్రేమగల ఆయన ఉన్నతమైన ప్రణాళికను మీరు అర్ధము చేసుకొనవలెనని మరియు మీ విశ్వాసమునకు స్ధిరమైన పునాది వేసుకొనవలెనని కోరుచున్నాము. సిలువను గూర్చిన వర్తమానము 1986 నుండి అసంఖ్యాకమైన ప్రజలను రక్షణ మార్గములోనికి నడిపించి అనేక విదేశీ క్రూసేడ్ల ద్వారా లెక్కింపజాలని పరిశుధ్దాత్ముని క్రియలను ప్రదర్శించెను. చివరకు, తండ్రి అయిన దేవుడు దీనిని ప్రచురించుటకు నన్ను దీవించెను. మహిమ కృతజ్ఞతలు నేను ఆయనకు చెల్లించెదను! చాలామంది సృష్టికర్తయైన దేవునియందు నమ్మిక వుంచామని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలుసని చెప్పుదురు కానీ ధైర్యముతో వారు సువార్తను బోధించలేకపోవుచున్నారు. వాస్తవమునకు కొద్దిమంది క్రైస్తవులు మాత్రము దేవుని హృదయమును ఆయన ఏర్పాటును ఎరుగుదురు. ఇంకాచెప్పాలంటే, కొంతమంది క్రైస్తవులు బైబిల్లో చూపిన అనేకమైన ప్రశ్నలకు స్పస్టమైన జవాబులు తెయియక మరియు దేవుని ప్రేమయొక్క మర్మమైన ఏర్పాటును అర్ధంచేసుకోలేక దేవుని నుండి విడిపోయిరి.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







