ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యష్టి కుటుంబాలు చోటుచేసుకున్నాయి. నేటి ప్రపంచం లో అమ్మానాన్నలు వృత్తిరీత్యా తీరిక లేని పరిస్థితి. ఈ పరుగుల ప్రపంచంలో పిల్లలతో సమయం గడిపి కథల ద్వారా మానవతా విలువలు, ఆరోగ్య కరమైన జీవనశైలి అలవాటు చేయడం చాలా కష్టతరమైపోయింది. టెక్నాలజీ పిల్లల్ని, పెద్దల్ని సమానంగా కట్టివేసింది, ఇటువంటి సమయంలో శ్రీ చోడా సాంబశివరావు గారు నేటి బాల బాలికల కోసం ''చిట్టి కథలు'' పేరుతో మన మాతృభాష అయిన తెలుగులో కథల పుస్తకమును అందించడం మంచి ప్రయత్నం. నీతి కథలు మన నిత్యజీవితంలో సన్మార్గంలో ప్రయాణించడానికి దోహదం చేస్తాయి. అలాగే జీవితంలో ఏ విధంగా మెలగాలి అనే సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగల మనోధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, మంచి ప్రవర్తనను, మంచి చెడుల తారతమ్యాన్ని నేర్పడానికి దోహద పడతాయి. . ఇవి చదవడం వలన మనోల్లాసం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస సమాజానికి ఉపయోగపడే మరెన్నో విషయాలు కళ్ళకు కట్టినట్లుగా మనసులో నాటుకుంటాయి.. ఈ పుస్తకం లో కేవలం నీతికథలే కాక ఇతిహాసాలలోని కొన్ని ముఖ్యమైన కథలను ఘట్టాలను చేర్చి పిల్లల్లో కథలు చదవాలని ఆసక్తి పెరిగేలా పుస్తకాన్ని కూర్చిన రావు గారికి అభినందనలు. ఈ చిట్టి కథలు చిన్నారులలో ఒంటరితనాన్ని దూరం చేసి పరిపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నాము. ఈ పుస్తకాలను మా విద్యార్థుల కోసం జాన్సన్] గ్రామర్] పాఠశాల కుంట్లూరు లోని గ్రంథాలయానికి అందించడం అభినందనీయం. చీఫ్] కోఆర్డినేటర్], జాన్సన్] గ్రామర్] స్కూల్], కుంట్లూరు, హైదరాబాద్]
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







