నా పేరు వేండ్ర గోపాలకృష్ణ తల్లిదండ్రుల పేర్లు శ్రీ వెంకన్మ, శ్రీమతి మంగమ్మ పెనుగొండ గ్రామం పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాను ఎమ్మెస్సీ వరకు చదువుకున్నాను. చిన్నతనం నుండి చిత్రకళ పట్ల చాలా ఆసక్తిగా ఉండేది బొమ్మలు గీసే వాడిని... మా డ్రాయింగ్ టీచర్ నేను ఎంతో ప్రోత్సహించేవారు అనేక పోటీలలో బహుమతులు గెలుచుకున్నాను. 1983లో ఆంధ్రప్రభ వార పత్రికలో నా మొట్టమొదటి సారిగా కార్టూన్లు ప్రచురింపబడ్డాయి... అన్ని తెలుగు దిన వార పక్ష మాస పత్రికలలో నా కార్టూన్లు వచ్చాయి. చాంగురే బంగారు రాజా శీర్షికతో హాసం మాసపత్రికలోనూ స్మైల్ ప్లీజ్ శీర్షిక తో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో చాలాకాలం నా కార్టూన్ వచ్చాయి ప్రస్తుతం హాస్యానందంలో నవ్వే ఆనందం strip cartoon.. మాధురి పత్రికలో గోపాలియం సైలెంట్ కార్టూన్ వేస్తున్నాను.... స్థానిక రాష్ట్రస్థాయి జాతీయస్థాయి కార్టూన్ పోటీలలో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను.. హైదరాబాదులోని హార్ట్ యానిమేషన్ అకాడమీలో యానిమేషన్ కోర్స్ చేసి యానిమేటర్ గా క్యారెక్టర్డిజైనర్ గా స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ గా అనేకసంస్థల్లో పని చేశాను.. అలాగే స్కాలర్షిప్స్లో సిండికేసన్ ఆర్టిస్టుగా అలాగే రామోజీ ఫిలిం సిటీ లో యానిమేటర్ గా గ్రాఫిక్స్ డిజైనర్ గా ఆర్టిస్ట్ గా పని చేస్తాను.. ప్రస్తుతం freelance ఆర్టిస్టుగా కథలకు బొమ్మలు ఒక నవలసుకు కథల పుస్తకాలకు ముఖచిత్రాలు లోగోలు.. ఎంబ్లెమ్స్ డిజిటల్ పెయింటింగ్... చేస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాను... గురుతుల్యులు శ్రీ జయదేవ్ గారి సంస్థ నుండి నా కార్టూన్స్ తో మొదటిసారిగా గోపాలకృష్ణ కార్టూన్స్ బుక్ రిలీజ్ అయింది.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno







